పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. వాషింగ్టన్లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. అమెరికా మధ్యవర్తిత్వంలో దాదాపు తొమ్మిది గంటలపాటు వాషింగ్టన్లో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం, ఇజ్రాయెల్ – లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే, ఈ శాంతి ఒప్పందం పూర్తిగా హిజ్బొల్లా సాయుధ దళాల చర్యలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
లెబనాన్‌లోని ‘సౌత్ లిటానీ’ (South Litani Sector) ప్రాంతం నుంచి హిజ్బొల్లా సాయుధ బలగాలు పూర్తిగా తప్పుకోవాలి. అలాగే ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా జరిపే దాడులను పూర్తిగా నిలిపివేయాలి. అలా జరిగితేనే ఈ కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాలపై ఏ ఇతర సాయుధ సంస్థల ప్రమేయం లేకుండా, కేవలం లెబనాన్ అధికారిక సైన్యం (Lebanese Armed Forces) మాత్రమే పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. లెబనాన్ సైన్యం తన సార్వభౌమాధికారాన్ని దేశవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా అమెరికా తగిన సైనిక, వ్యూహాత్మక మద్దతును అందిస్తుంది
